టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే బెందాళం అశోక్ తె లిపారు. బుధవారం ఇచ్ఛాపురం మునిసిపాలిటీలోని ఆరోవార్డు పొందర వీధిలో రూ.ఐదు లక్షల ఎంపీ నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇచ్ఛాపురం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారని, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ కార్యదర్శి నందికిజాని, రాష్ట్ర బీసీ సాధికార సమితి కన్వీనర్ కొండా శంకర రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాలిన ఢిల్లీ, ఆరో వార్డు ఇన్చార్జి కొరాయి ధర్మరాజు, తెలుగుయువత అధ్యక్షుడు కాళ్ల జయదేవ్, కౌన్సిలర్ పత్రి తవిటయ్య, ఆశి లీలా రాణి, నాయకులు రెయ్యి జానికిరావు, బి.కృష్ణయ్య, జిలానీ, దక్కత ఢిల్లీరావు, సహదేవ్రెడ్డి, ఆశి జీవులురెడ్డి పాల్గొన్నారు.