రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతుందని, ఈ ప్రభుత్వాన్ని ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంటరావు పిలుపునిచ్చారు. పాలఖండ్యాం నుంచి 10 వైసీపీ కుటుంబాలు బుధ వారం జి.సిగడాం పార్టీ క్యాంప్ కార్యాలయంలో కళా వెంటరావు సమక్షంలో టీడీపీలో చేరారు. గ్రామానికి చెందిన పోతల త్రినాథరావు, చిర్రా గోవిందరావు, గుంటుబోను చిమ్మారావు, కె.సీతారాం, లోపింటి రమే ష్, గుంటుబోను శంకరరావు, చిల్లా తిరుపతిరావు, పలిశెట్టి చిన్నారావులతో పాటు పలువురిని టీడీపీ కండువావేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 43వేల కోట్లు అక్రమాస్తుల కేసులో 16 నెలల జైల్లో ఉన్న జగన్‌రెడ్డి ముఖ్యమంత్రికి కావడం రాష్ట్ర ప్రజల రౌర్భాగ్యమన్నారు. తాను జైల్లో ఉన్నాను కనుక ఎలా గైనా చంద్రబాబును జైల్లో పెట్టాలనే కుట్ర, రాజకీయ కక్షతో అరెస్టు చేయించారని మండిపడ్డారు. తల్లి, చెల్లిని చూడనివాడు రాష్ట్ర ప్రజలకు ఏమి ఉద్దరిస్తాడు అని ఎద్దేవా చేశారు. జగన్‌రెడ్డి పాలనపై రాష్ట్ర ప్రజలు విసుగుచెందారని, ఎప్పుడు ఎన్నికలు వస్తాయో వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుదామా అని ఎదురుచూస్తున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కు మరాపు రవికుమార్, టంకాల మౌళీ శ్వరరావు, బెవర జగన్నాథరావు, పలిశెట్టి చంద్రరావు, సిగటాపు గోవిందరావు, మహాదాశ్యం చిన్నారావు, పైల రామకృష్ణంనాయుడు, నక్క మురళి, కోన వెంకటరావు, జక్కంపూడి దాసు, విక్రం కాశీబాబు, చిత్తిరి అసిరినాయుడు, పి.శ్యామలరావు, విక్రం సత్యారావు తదితరులు పాల్గొన్నారు.