ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని ఏపీ భవన్లో ఈరోజు మధ్యాహ్నం వైఎస్ షర్మిల దీక్షకు దిగనున్నారు. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితం ఆమె ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిశారు.
ప్రత్యేక హోదా, విభజన హామీలపై తాము చేస్తున్న పోరాటానికి మద్దతును ఇవ్వాలని పవార్‌ను కోరారు. పార్లమెంటులో ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తాలని విన్నవించారు.