శెట్టూరు మండలం ఎర్రబోరేపల్లి గ్రామానికి చెందిన మర్రిస్వామి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఎర్రబోరేపల్లి గ్రామానికి చెందిన వడ్డే మర్రిస్వామి తన భార్య పుట్టింటికి వెళ్లి మూడు సంవత్సరాలు అయిందన్నారు. దీంతో మనస్తాపానికి గురైన మర్రిస్వామి గ్రామ శివారులలోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మృతునికి భార్య, ఒక కుమార్తె, ఒక కొడుకు ఉన్నారు.