మోదీ సర్కార్‌పై APPCC చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి పదేళ్లు అయినా అమలు చేయలేదన్నారు. రాష్ట్రాన్ని కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు.
హామీలు అమలు చేయకపోయినా బీజేపీకి ఏపీ ఎంపీలు ఎందుకు మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు. కడప స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా, పోలవరం అంశాలపై తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.