పామర్రు - గుడివాడ రహదారిలో ఫ్లై ఓవర్ వద్ద శుక్రవారం ఎదురెదురుగా వచ్చిన రెండు ఆటోలు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆటోలో పయనిస్తున్న 8 మందికి గాయాలు కాగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని హుటాహుటిన 108 వాహనం ద్వారా గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ఆటోలు వేగంగా వచ్చి ఢీకొనడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa