గత ఐదేళ్లలో అభివృద్ధిలో కంటే డ్రగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రాచుర్యం పొందిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. గంజాయిలో కాకినాడ పోలీసులు పట్టుబడటం ఆందోళన కలిగిస్తోందని అన్నారు.
ఈ ఘటనపై వైసీపీ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. గంజాయి రవాణా వెనుక సూత్రధారి ఎవరో తేల్చాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.