కర్ణాటకలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన మూడో భార్యను భర్త 12 ఏళ్ల పాటు గృహనిర్భందంలో ఉంచాడు. ఇప్పటికే ఇద్దరు భార్యలు విడాకులు తీసుకోవడంతో 3వ భార్య కూడా విడాకులు అడుగుతారేమోనన్న భయంతో ఇంటికి 3 తాళాలు వేసి బంధించి ఉంచాడు.
మరుగుదొడ్డి కూడా లేకుండా ఆ మహిళ బకెట్లో మలమూత్ర విసర్జన చేసిందని సమాచారం. ఈ దారుణాలను తట్టుకోలేని మొదటి ఇద్దరు భార్యల ఫిర్యాదుతో పోలీసులు భర్తను అరెస్ట్ చేశారు.