యూపీ కాన్పూర్ సమీపంలోని చౌబేపూర్లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. కొన్నాళ్లుగా ఓ యువతి వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమిస్తోంది. అయితే మరో వ్యక్తితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు.
పెళ్లి రోజున మేకప్ కోసం ఆమె బ్యూటీపార్లర్‌కు వెళ్లింది. ప్రియుడిని పిలిచి, అతడితో ఆమె లేచిపోయింది. దీంతో పెళ్లిమండపంలో ఉన్న వరుడు షాక్ అయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో యువతి, ఆమె ప్రియుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.