ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ వైసీపీకి వీడ్కోలు చెప్పనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి, టీడీపీలో చేరనున్నట్లు ప్రచారం జరగుతోంది.
ఈ క్రమంలోనే ఏలూరు జిల్లా దెందులూరులో జరిగే 'సిద్ధం' సభకు ఆయన దూరంగా ఉంటున్నట్లు సమాచారం. కాగా, ఇప్పటికే మైలవరం టీడీపీ అభ్యర్థిగా వసంత పేరుతో చంద్రబాబు సర్వే నిర్వహించినట్లు టాక్ నడుస్తోంది.