అవినీతి రహిత సంక్షేమం, అన్ని రంగాలలో సమాన అభివృద్ధిని అందించే వ్యక్తులు కావాలా..?? అవినీతి, అక్రమాలు, అరాచకాలు, దౌర్జన్యాలను పెంచి పోషించే వ్యక్తులు కావాలో..?? ప్రజలు ఒక్కసారి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఎంతో అవసరమని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, రూరల్ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి సూచించారు. 8 మాసాల కాలంలో రూ.150 కోట్లకు పైబడి అభివృద్ధి నిర్మాణ పనులకు నిధులు తీసుకొచ్చిన అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తి కావాలా...?? లేక నాలుగున్నర సంవత్సరాల కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అరాచకాలు, దౌర్జన్యాలు, అక్రమాలను దినదిన ప్రవర్ధమానం చేసే వ్యక్తి కావాలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు మంచి మనసుతో ఆలోచించాలని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సూచించారు.