ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చర్యలతో గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుందని మంత్రి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. అల్లవరం మండలం, మొగళ్లమూరులోని గోగివారిపేటలో 30 లక్షల రూపాయల ఎంపీ లాడ్స్ నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి పినిపే విశ్వరూప్, అమలాపురం పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్ల క్రితం రాష్ట్రంలో ఏ పంచాయతీ కూడా అభివృద్ధికి నోచుకోలేదు సరికదా సరైన సౌకర్యాలు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడేవారు. ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండేవారు కాదు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి ప్రతి గ్రామలోనూ పదిమందికి పైగా ప్రభుత్వ సిబ్బందిని నియమించారు.