ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. సెన్సెక్స్ ఒక దశలో 73,000 మార్క్‌ను దాటి 73,089కి చేరుకుంది. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 440 పాయింట్లు పెరిగి 72,086 వద్ద ముగిసింది. నిఫ్టీ 156 పాయింట్లు పెరిగి 21,854 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (4.10%), ఎన్టీపీసీ (3.34%), టీసీఎస్ (2.98%), టాటా స్టీల్ (2.89%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (2.74%).
టాప్ లూజర్స్: యాక్సిస్ బ్యాంక్ (-1.42%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.33%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.81%), ఐటీసీ (-0.60%), L&T (-0.57%).