ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఒడిశాలో పర్యటించనున్నారు.ఒడిశాలోని సంబల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ రూ.68,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.
జగదీష్పూర్-హల్దియా, బొకారో-ధమ్రా పైప్‌లైన్ ప్రాజెక్ట్ లోని ధమ్రా అంగుల్ పైప్‌లైన్ సెక్షన్‌ను ప్రధాని ప్రారంభిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి.అనంతరం నాగ్‌పూర్-జార్సుగూడ సహజ వాయువు పైప్‌లైన్ సెక్షన్‌కు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.