క్రిమినల్ పరువునష్టాన్ని మనదేశంలో తిరిగి నేరచట్టాల పరిధిలోకి తీసుకురావాలని న్యాయ కమిషన్ సిఫార్సు చేసింది. అప్పుడే- నిందాపూర్వక ప్రసంగాలు, ఆరోపణల నుంచి ‘ప్రతిష్ఠ హక్కు’కు తగిన రక్షణ దక్కుతుందని సూచించింది.
కేంద్ర ప్రభుత్వానికి ఈ మేరకు ఓ నివేదిక సమర్పించింది. ‘‘ప్రతిష్ఠ మన కంటికి కనిపించదు. జీవితకాలంపాటు కష్టపడి సంపాదించుకునే ఆస్తి అది. కానీ సెకన్లవ్యవధిలో అది నాశనం కావొచ్చు’’అని అందులో పేర్కొంది.