సీఎం వైయస్ జగన్ అంటే నిజం.. ఆయన ఏది చెప్పినా నిజమని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు అంటే అపద్ధం. చంద్రబాబు అంటే మోసం, చంద్రబాబు అంటే కుట్ర, చంద్రబాబు అంటే దగా, చంద్రబాబు వెన్నుపోటు అని విమర్శించారు. పథకాల పేరుతో ప్రజలను వంచనకు గురి చేసిన చంద్రబాబును నమ్ముతారా...అదే పథకాల పేరుతో పేదల బ్యాంకు ఖాతాల్లో లక్షల రూపాయలు జమ చేసిన జగనన్నను నమ్ముతారా...ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి’’ అని రాప్తాడు ఎంఎల్ఎ తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రామగిరి మండలం ఎంసీపల్లి, పేరూరు, రామగిరి, కనగానపల్లి మండలం ముత్తవకుంట గ్రామాల్లో ‘వైయస్ఆర్ ఆసరా’ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.