మైనారిటీలను టీడీపీ గొంతు కోస్తే..సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అదే మైనారిటీలకు న్యాయం చేస్తున్నారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. రాజకీయాలకతీతంగా ఖలీల్ అహ్మద్‌ను నెల్లూరు సిటీలో గెలిపించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్చార్జిగా ప్రకటించడంతో విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు ఎంపీ కార్యాలయంలో శనివారం పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. అనంతరం ఖలీల్ అహ్మద్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మైనారిటీ నాయకులు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన అబ్దుల్ అజీజ్ కు టీడీపీ గొంతు కోస్తే.... మరోవైపు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మైనార్టీలకు ఎమ్మెల్యే స్థానం కేటాయించారని ఇది సామాజిక న్యాయమని నిదర్శనమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నేత కంతర్ ఆలీ పేర్కొన్నారు. కంతర్ ఆలీ మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీలకు న్యాయం చేసే ఒకే ఒక్క పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే టికెట్ ను ఒక మైనారిటీలకు వైయస్ఆర్ కాంగ్రెస పార్టీ కేటాయించిందన్నారు. తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీలను ఓటు బ్యాంకు గానే వాడుకుంటుందని విమర్శించారు. రాజకీయాలకతీతంగా నెల్లూరు నగరం, నెల్లూరు జిల్లాలో ముస్లింలందరూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకుంటామని పేర్కొన్నారు. బారాషాహీద్ దర్గా ఫెస్టివల్ కమిటీ చైర్మన్ ఖాద్రి మాట్లాడుతూ ఒక సామాన్యుడికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు సిటీ ఇన్చార్జి గా ప్రకటించడం హర్షనీయమన్నారు. తమకు నిరంతరం న్యాయం చేస్తున్న సీఎం వైయస్ జగన్‌కు అండగా ఉంటామని ప్రకటించారు. కార్యక్రమంలో 28వ డివిజన్ కార్పొరేటర్ సత్తార్, బారాషాహిద్ దర్గా చైర్మన్ ఇస్మాయిల్ ఖాదరి, మాజీ చైర్మన్ రజాక్, ఉమర్, రియాజ్, జాకీర్, అలీబాయి మౌలాలి, అంజాద్, సిహెచ్ సూరిబాబు, పలువురు ముస్లిం, మైనార్టీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.