వంశధార ఎస్ఈ కార్యాలయ ప్రాంగణంలో బొడ్డేపల్లి రాజగోపాలరావు విగ్రహాన్ని మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ఈ ప్రాంగణాన బొడ్డేపల్లి రాజగోపాలరావు విగ్రహం పెట్టడం సబబు. వంశధార ప్రాజెక్టు సాధనలో ప్రముఖ పాత్ర పోషించిన బొడ్డేపల్లి విగ్రహం పెట్టడం సమంజసం. ఈ ప్రాజెక్టుకు రాజశేఖర రెడ్డి హయాంలో బొడ్డేపల్లి పేరు పెట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టు సాధనలో చాలా మంది ఇంజినీర్లు రక,రకాల వ్యక్తులు, సాంకేతిక నిపుణులు ఉన్నారు. వీరంతా ఈ ప్రాజెక్టు సాధనలో అంకింతం అయి ఉన్నారు. ఈ శుభవేళ ఈ ప్రాజెక్టులో పనిచేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. ఇదే సందర్భంగా గొట్టా వద్ద బ్యారేజీ కడితే 19 టీఎంసీ సేకరించడం సాధ్యం. నేరడి బ్యారేజీ ఎలవ్ చేయలేదు. గొట్టా వద్ద స్టాగ్నేటెడ్ వాటర్ ను రిజర్వాయర్ లోకి పంపాలని అనుకుంటున్నాం. రిజర్వాయర్ లో ఉన్న 19 టీఎంసీని ఉపయోగించుకుంటాం. అని అన్నారు .