ఏపీ రాష్ట్రంలో మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇంటర్ విద్యా మండలి అధికారులు వెల్లడించారు. ప్రథమ, ద్వితీయ పరీక్షలు మార్చి 20వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు.
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, ఇంటర్మీడియట్ వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు సైతం అదే తేదీల్లో కొనసాగుతాయన్నారు. టైంటేబుల్ http://bie.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.