కాశ్మీర్‌లో శ్రీనగర్ సహా అనేక ప్రాంతాలను మంచు కమ్మేసింది. హిమపాతం కారణంగా ఎత్తైన ప్రాంతాలతో పాటు లోయలు సైతం మంచుతో నిండిపోతున్నాయి.
రానున్న రెండురోజుల్లో హిమపాతం తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. చాలాచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 0-3 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంటుందన్నారు. పర్వత ప్రాంతాల్లో మంచు చరియలు విరిగిపడే ముప్పు ఉంటుందని హెచ్చరించారు.