వైసీపీ మంత్రి ఉష శ్రీచరణ్ కు శనివారం చేదు అనుభవం ఎదురైంది. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని చాలకూరులో ఆత్మీయ పలకరింపు కార్యక్రమంలో భాగంగా మంత్రి పర్యటించారు.
అయితే వైసీపీ అసమ్మతి వర్గానికి చెందిన అశ్వథ్థామ అనే మహిళా నాయకురాలి ఇంటికి వెళ్లిన మంత్రిని స్థానిక సర్పంచ్, గ్రామ నాయకులు అడ్డుకున్నారు. ఆమె ఫ్లెక్సీలను కూడా చించేశారు. దీంతో అక్కడి నుంచి మంత్రి వెళ్లిపోయారు.