వికాసిత్ భారత్ లక్ష్యం నెరవేరాలంటే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ప్రధాని మోదీ అన్నారు. శనివారం ఒడిశాలోని సంబల్పూర్లో పర్యటించిన ఆయన ఐఐఎం కొత్త క్యాంపస్‌ను ప్రారంభించారు.
అనేక ప్రాజెక్టులు రూ. 68 వేల కోట్లతో ప్రారంభించారు. అనంతరం కాంగ్రెస్, దాని మిత్రపక్షాలపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. రాష్ట్రపతి పదవిని చేపట్టిన తర్వాత గిరిజన మహిళ ద్రౌపది ముర్మును తక్కువ చేసి మాట్లాడారని కాంగ్రెస్ నేతలను మోడీ విమర్శించారు.