బదౌన్ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న మహిళా జడ్జి ఆత్మహత్య చేసుకుంది. నగరంలోని జడ్జి కాలనీలో నివాసం ఉంటున్న జూనియర్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జ్యోత్స్నారాయ్ (27) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
గత ఏడాది ఏప్రిల్ 29న ఆమె బదౌన్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్)గా నియమితులయ్యారు. అంతకు ముందు అయోధ్యలో పనిచేశారు.