సాధారణంగా టమోటాలు ఏ రంగులో ఉంటాయో అందరికీ తెలిసిందే. బీహార్‌లోని గయాకు చెందిన ఓ రైతు నల్ల టమాటా సాగు చేస్తున్నాడు. వచ్చే ఏడాది నుంచి ఈ నల్ల టమాటాలను పెద్ద ఎత్తున మార్కెట్‌లోకి తీసుకురానున్నారు.
ప్రస్తుతం, వీటికి మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. కిలో రూ.100 నుంచి 150 పలుకుతుందని రైతు తెలిపారు. అలాగే ఈ టమాట సాగు ఏడాదికి 8 లక్షల రూపాయల ఆదాయం పొందవచ్చని రైతు తెలిపారు. ప్రస్తుతం బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వీటిని ఎక్కువగా సాగు చేస్తున్నారు.