దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దీర్ఘకాలంపాటు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు భారత్‌లోని పవిత్ర స్థలాల ప్రాముఖ్యతను గుర్తించడంలో విఫలమయ్యాయని ప్రధాని మోదీ అన్నారు.
అసోంలోని రూ.11,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్ట్‌లను ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వాలు సంస్కృతి, సంప్రదాయాల ప్రాముఖ్యతను విస్మరించాయని, వాటిని పాటించడం అవమానకరం అనే భావన కల్పించాయని విమర్శించారు.