లక్షలాదిమంది నిరుపేదలకు కుల, మత భేదాలు లేకుండా విద్య, వసతి, భోజనం కల్పించి.. నడిచే దేవుడిగా కీర్తి పొందిన సిద్దగంగా మఠాధిపతి డాక్టర్ శివకుమారస్వామికి భారతరత్న ఇవ్వాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య డిమాండ్ చేశారు.
గతంలోనే స్వామిజీకి భారతరత్న ఇవ్వాలని బీజీపీ పెద్దలను కోరామని, వారు పట్టించుకోలేదని ఆరోపించారు. పేదలకు అన్నదానం చేయడంలో స్వామిజీకి ప్రత్యేకమైన పేరుందని తెలిపారు.