ఉక్రెయిన్లోని రష్యా ఆక్రమిత లుహాన్స్క్ ప్రాంతంపై భీకర దాడి జరిగింది. ఈ ఘటనలో లిసిచాన్స్క్ నగరంలోని ఓ బేకరీ ధ్వంసం కాగా.. దాదాపు 28మంది మృతి చెందారు.
మరణించిన వారిలో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు రష్యా అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన మరో 10మందిని కాపాడినట్లు తెలిపారు. ఇది కీవ్ బలగాల పనేనని ఆరోపించారు. ఈ ఘటనపై ఉక్రెయిన్ స్పందించలేదు.