అన్నపూర్ణ అయిన ఆంధ్రప్రదేశ రాష్ట్రాన్ని వైసీపీ నాయకులు గంజాయి రాజధానిగా మార్చివేశారని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్ల మెంటు అధికార ప్రతినిధి కోటపల్లె బాబురెడ్డి పేర్కొన్నారు. పీలేరులోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం విలేఖరుల స మావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకప్పు డు పెద్దపెద్ద పట్టణాలకే పరి మితమైన గంజాయి వ్యాపారం నేడు మారుమూల గ్రా మాలకు విస్తరించిందని, తమ స్వలాభం కోసం అధికార పార్టీ నాయకులు హైస్కూల్ విద్యార్థులతో కూడా గంజాయి వ్యాపారం చేయిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల జోక్యం ఉండడంతో పోలీసులు కూడా అందులో భాగస్వామ్యులైనట్లు ఉన్నారని కోటపల్లె బాబురెడ్డి తెలిపారు. ఇటీవల హైదరాబాదులో 22 కిలోల గంజా యితో కాకినాడకు చెందిన స్పెషల్ బెటాలియన పోలీసులు పట్టుబడడం ఇందుకు సజీవ సాక్ష్యమన్నారు. చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి పోలిశెట్టి సురేంద్ర మా ట్లాడుతూ టీడీపీ, జనసేన కూటమికి పట్టం కట్టేందుకు రాష్ట్ర ప్రజలు ఇప్పటికే నిర్ణయిం చుకున్నారని, వైసీపీ నాయకుల కుట్రలు నమ్మే స్థితిలో లేరన్నారు. సమావేశంలో నాయకులు కం చి సూరి, లక్ష్మీకర, శ్రీకాంత రెడ్డి, పురం రామ్మూర్తి, షామియాన జయన్న, మహమ్మద్ పీర్, ఇర్షాద్, హరి, ముబారక్, పురుషోత్తంరెడ్డి, శ్రీనాథరెడ్డి, విజయకుమార్ పాల్గొన్నారు.