శ్రీకాకుళం నియోజకవర్గం చాపురం పంచాయతీ నుంచి టీడీపీ సీనియర్ నాయకుడు రెడ్డి చిరంజీవులు ఆధ్వర్యంలో 80 కుటుంబాల వారు తెలు గుదేశం పార్టీలో చేరారు. ఆదివారం వారు మాజీ మంత్రి గుండ అప్పలసూర్య నారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి సమక్షంలో అరసవల్లిలోని వారి స్వగృహంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గుండ దంపతులు వారికి పార్టీ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గుండ దంపతులు మాట్లాడుతూ.. వైసీపీ పాలనతో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీని ఓడించేందుకవువ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు జోగారావు, అల్లు రమేష్, అల్లు శ్రీరాములు, మ ట్ట ఢిల్లేశ్వరరావు, తిప్పన శ్రీనివాసరావు, అంపోలు శ్యామలరావు, తిప్పన సంతోష్ కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు సీర రమణయ్య, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు చిట్టి మోహన్, టీడీపీ అధికార ప్రతినిధి ముద్దాడ కృష్ణమూర్తినాయుడు, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు బలగ చెంగలరావు, మాజీ సర్పంచ్ సూరాడ అప్పన్న తదితరులు పాల్గొన్నారు.