జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు డబ్బు, ఆస్తులకి కొదవేముంది. అత్తారింటికి దారేదిలో క్యారెక్టరే పవన్ నిజమైన జీవితం. ప్యాకేజీ... ప్యాకేజీ... అంటారా..? పేద, నిరుపేదలందరిని పైకి తీసుకురావడమే పవన్ ప్యాకేజీ. కులాలు, మతాలకు అతీతంగా ఉండాలని, సమాజం కోసం బతకాలని ఆయన చెబుతుంటారు. అభిమానులు, కార్యకర్తలను పవన్ నేరుగా కలుస్తున్నారు కానీ.. అందరినీ (ప్రజలను) కలవాల్సిన సీఎం అయిదేళ్లుగా ఎవరూ కలవలేకపోతున్నారు. యువత, పవన్ అభిమానుల సత్తా ఏమిటో చూపుతాం. పవన్ అసెంబ్లీకి వెళ్లకుండా ఎవరాపుతారో ఆపండి.. చూస్తాం..! ఈ సారి పవన్ అసెంబ్లీకి వెళ్లడం పక్కా. మద్యపాన నిషేదంపై హామీ ఇచ్చిన ఎన్టీఆర్ మాట నిలబెట్టుకున్నారు. మరి మీరూ... మద్యం ఫ్యాక్టరీలు నడుపుతున్నారు. సీఎం జగన్ పవన్‌పై విమర్శలు చేసే ముందు.. వైసీపీ కోసం కష్టపడే ద్వితీయ శ్రేణి నేతల, కార్యకర్తల కష్టాలను పరిష్కరించాలి’’ అని వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై జానీ మాస్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.