రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి 2019లో ఓట్లు అడిగింది గుర్తులేదా..? అని ఎంపీ బాలశౌరి ప్రశ్నించారు. 2024లో ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారో జగన్ చెప్పాలని బాలశౌరి నిలదీశారు. వందల కోట్లు పెట్టీ ‘‘సిద్ధం’’ మీటింగ్‌లు, హోల్డింగ్స్ పెడుతున్నారని.. ఇంతకీ వైసీపీ దేనికి ‘‘సిద్ధం’’..? పారిపోవడానికి ‘‘సిద్ధ’’మా..? అని సెటైర్లేశారు. దేవుడు జగన్ ఒక్కరికే కాదు.. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, సునీతకు కూడా ఉన్నారని.. అన్ని చూస్తున్నాడని తెలిపారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీలో జరిగినవన్నీ తనకు తెలుసన్నారు. రానున్న రోజుల్లో అన్నీ వివరిస్తానని ఆయన అన్నారు. తన పెదన్నయ్య చిరంజీవికి అన్ని అవార్డులు వచ్చాయని.. భారతరత్నమాత్రమే మిగిలి ఉందని అన్నారు. తన శ్రేయస్సు కోరుకునే వ్యక్తి తన చిరంజీవి అని చెప్పారు. తన రాజకీయ జీవితం ఇకపై పవన్ కళ్యాణ్‌తోనే అని ఎంపీ తెలిపారు. పార్టీలో తనకు ఏ బాధ్యత ఇచ్చినా ఒక సైనికుడిలా పని చేస్తానని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు.