జార్ఖండ్‌లో కొత్తగా కొలువుదీరిన సీఎం చంపై సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇవాళ బలపరీక్షను ఎదుర్కోనుంది. మొత్తం 81 మంది సభ్యులు ఉండే ఆ రాష్ట్ర అసెంబ్లీలో.. మెజార్టీని నిరూపించుకోవాలంటే 41 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం జేఎంఎం (28), కాంగ్రెస్ (16), ఆర్జేడీ (1), సీపీఎంఎల్ (1) కూటమికి 46 మంది ఎమ్మెల్యేలున్నారు. బీజేపీ, దాని మిత్రపక్ష పార్టీలకు కలిపి 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.