సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ వివిధ మార్గాల్లో జనంపై దాడి చేస్తున్నారు. ఫలానా బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని, మీ కేవైసీ వివరాలు అప్‌డేట్ చేసుకోవాలని అడుగుతున్నారు. ఇటీవల సంబంధిత బ్యాంకు లోగోను,
ఒరిజినల్ వెబ్‌లింకును పోలి ఉండేలా నకిలీ లింకులను సృష్టించి పంపుతున్నారు. వినియోగదారులు క్లిక్ చేసి మోసపోతున్నారు. ఇలా ఎవరైనా వివరాలు అడిగితే స్పందించవద్దని, సంబంధిత బ్యాంకుకెళ్లి నేరుగా తనిఖీ చేసుకోవాలని RBI తాజాగా సూచనలు జారీ చేసింది.