ప్రస్తుతం కర్ణాటక ప్రజలను మంకీ ఫీవర్‌తో వణికిస్తోంది. మంకీ ఫీవర్‌తో ఒక్కసారిగా ఆకస్మికంగా జ్వరం, తీవ్రమైన కండరాల నొప్పి, అలసట తదితర లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఈ వ్యాధి తీవ్రత పెరుగుతున్నపుడు వాంతులు, మోషన్స్ వంటి సమస్యలు ఉంటాయి. మంకీ ఫీవర్ ప్రభావం తీవ్రమైతే ముక్కు నుంచి రక్తస్రావం, చిగుళ్ల నుంచి రక్తస్రావం జరుగుతుందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. కొందరు వ్యక్తుల్లో వణుకు, అసాధారణంగా నడక, మానసిక గందరగోళం, కొత్తగా నాడీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.