సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గుత్తి మున్సిపాలిటీలోని పోలింగ్ కేంద్రాలను సోమవారం గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాసులు రెడ్డి తనిఖీలు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలలో అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ జి. శ్రీనివాసులుకు సూచించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని 37 పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికల సెక్టార్ అధికారులు, మున్సిపల్ మేనేజర్ తదితరులున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa