వైసీపీకి రాజీనామా చేసినట్లు చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆర్.గాంధీ వెల్లడించారు. ఇవాళ గంగాధర నెల్లూరులో జరిగే ‘రా..కదలిరా’ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నానని తెలిపారు.
వైసీపీలో దళితులకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగానే వైసీపీకి రాజీనామా చేశానని పేర్కొన్నారు. వైసీపీ కుల రాజకీయాలతో విసిగిపోయానని చెప్పారు.