మనీలాండరింగ్ కేసులో భాగంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితులపై ఈడీ దాడులు చేసింది. ఇవాళ ఉదయం కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ సహా పలువురు సన్నిహితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు.
ఢిల్లీలోని సుమారు 10 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు చెప్పారు. బిభవ్ కుమార్ అంతకుముందు ఢిల్లీ జలబోర్డులో సభ్యుడిగానూ పనిచేశారు.