ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చాణిక్యుడి మాదిరిగా పాలన సాగిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అభివర్ణించారు. అందరికీ సమానంగా పాలన అందాలనే వికేంద్రీకరణ చేశారని చెప్పారు. గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా రూ.2356 కోట్లతో పనులు చేపట్టిందని తెలిపారు. సామర్ధ్య ఆంధ్రా ద్వారా మానవ వనరులపై పెట్టుబడి పెడుతున్నామని, మానవ మూలధన అభివృద్ధికి గత ఐదేళ్లుగా ప్రాధాన్యతా క్రమంలో పెట్టుబడి పెట్టామన్నారు. ఐఎఫ్ పీ ప్యానెళ్లు ట్యాబ్ లను అందించటం ద్వారా బోదన, అభ్యాస ఫలితాలు మెరుగయ్యాయని చెప్పారు. 4 వ తరగతి నుంచి 12 తరగతి వరకూ 34.30 లక్షల మంది విద్యార్ధులు మరింత ప్రతిభావంతులయ్యారు. నాడు నేడు ద్వారా ఐదేళ్లలో 99.81 శాతం పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు అందించాం. మొత్తం 7,163 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. సంపూర్ణ పోషణ, గోరుముద్ద పథకాల ద్వారా పోషణా లోపాన్ని 2023 నాటికి 6.84 శాతానికి తగ్గించాం. విదేశీ విద్యాదీవెన ద్వారా 1,858 మంది విద్యార్ధులకు ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య ఇచ్చామని మంత్రి వెల్లడించారు.