జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు అమిత్ షాతో సమావేశం అయ్యారు.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. బుధవారం అమరావతి నుంచి హైదరాబాద్ వెళ్లిన పవన్ కళ్యాణ్.. ఇవాళ అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.