నేడు భారత మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ జయంతి. ఈయన భారత రాష్ట్రపతిగా 1967 నుండి 1969 వరకు ఉన్నారు. రాష్ట్రపతి పదవిలో ఉండగానే 1969 మే 3వ తేదీన మరణించారు.
ఈయన చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం 1963 లో ‘భారతరత్న’ పురస్కారాన్ని అందించడం జరిగింది. రాష్ట్రపతిగా మొదటి ప్రసంగంలో " భారతదేశం మొత్తం నా ఇల్లు, ప్రజలందరూ నా కుటుంబం" అనే వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి.