పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య శ్రీరాముడి ఆలయాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
భక్తులు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను ఆలయ పరిసర ప్రాంతాల్లో పడేస్తున్నారు. దీంతో అక్కడి ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ను తిరిగి దుకాణదారుడికి ఇస్తే రూ.5 పొందే కొత్త నియమాన్ని తెచ్చారు. దీంతో కొంత వరకు ప్లాస్టిక్ వ్యర్థాలను నివారించే అవకాశం ఉంటుంది.