అధికార వైసీపీ ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఇప్పుడు మాట తప్పారని కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల విమర్శించారు. గుంటూరు జిల్లా తెనాలి (M) కొలకలూరు పర్యటనలో ఆమె మాట్లాడారు.
'లిక్కర్ బ్రాండ్, పేరు, ధర ప్రభుత్వమే నిర్ణయించి దోపిడీ చేస్తోంది. భూకబ్జా చేసే ప్రభుత్వం అవసరమా? మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ ఇచ్చారు. డీఎస్సీ ప్రకటన ఎన్నికల స్టంట్. ఉద్యోగాలు లేక యువత రాష్ట్రం వదిలిపోతున్నారు.' అని షర్మిల మండిపడ్డారు.