తమిళనాడు రాజధాని చెన్నైలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. నగర వ్యాప్తంగా ఐదు పాఠశాలలకు గురువారం బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి.
దీంతో అప్రమత్తమైన ఆయా స్కూల్ యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాయి. విద్యార్థులు, సిబ్బందిని తక్షణమే ఇంటికి పంపించి పాఠశాలలను మూసివేశారు. రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. మొయిల్స్ పంపిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa