‘మండపేట మండలం కేశవరం గ్రామంలో ఎన్నికల తో సంబంధం లేకుండా ముందస్తుగా కేశవరం గ్రామాన్ని యూనిట్‌గా తీసు కుని ఇద్దరం మూఖాముఖి బరిలో నిల బడదాం... అంటూ నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఎమ్మెల్యే వేగుళ్లకు సవాల్ విసిరారు. అక్కడ తోట ఎక్కువ అవినీతికి పాల్ప డ్డారని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు చేసిన ఆరోపణల నేపథ్యంలో తాను అక్కడే గ్రామం యూనిట్‌గా చేసుకుని పోటికి సిద్ధమంటూ తోట చాలెంజ్ చేశా రు. దీన్ని స్వీకరించేందుకు వేగుళ్ల జోగే శ్వరరావు సిద్దమా? అంటూ తోట ప్రశ్నించారు. కేశవరం ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల విజయం సాధిస్తే తాను వైసీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ లో నుంచి తప్పుకుంటానని తోట స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తమ పార్టీ ఆద్యక్షుడు వైఎస్ జగన్ ప్రకటిస్తారని తోట చెప్పారు. అలాగే ఎమ్మెల్యే వేగుళ్ల ఓటమి చెందితే పోటీ నుంచి తప్పుకోవ డానికి సిద్ధమా? ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో చెప్పించగ లరా? అంటూ తోట ప్రశ్నించారు. ఎమ్మె ల్యే వేగుళ్ల మాటల గారడీ చేయకుండా సూటిగా సమాధానం చెప్పాలని తోట డిమాండ్ చేశారు. సమావేశంలో మున్సి పల్ చైర్‌పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి, ఎంపీపీ వాసు, పట్టణ కాపు సంఘం అధ్యక్షుడు జిన్నూరి సాయి బాబా, పి.ప్రసాద్‌లు పాల్గొన్నారు.