రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం కే. జీ. కుంట గ్రామంలో మాజీ మంత్రి పరిటాల సునీత వేరుశనగ పంటను పరిశీలించారు. రైతు నడిమింటి శివ తనపొలంలో వేరుశనగ పంటను సాగుచేయగా దిగుబడిరాక తొలగిస్తున్న విషయం తెలిసి కూలీలతో కలిసి పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇటువంటి పంట నష్టపోయిన రైతులను గుర్తించి పంట నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల టీడీపీ నాయకులూ పాల్గొన్నారు.