శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర మండలం చందకచర్ల గ్రామంలో శనివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వైకాపా నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజలు సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. మళ్లీ జగనన్నను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో వైకాపా సీనియర్ నాయకులు పాల్గొన్నారు.