అనుమానంతో ఓ భర్త తన భార్యను కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లాలో చోటు చేసుకుంది. హమీద్ (60) తన కుటుంబంతో కలిసి మంగ్‌లౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తుంటాడు.
ఇతడి భార్య ఖాతూన్ (52) వివాహేతర సంబంధం పెట్టుకుందని హమీద్ అనుమానించేవాడు. దాంతో తరచూ గొడవలు జరిగేవి. ఆమెను చంపాలని ప్లాన్ చేసుకున్న హమీద్.. నిద్రిస్తున్న భార్య నోట్లు విద్యుత్ వైరు పెట్టాడు. విద్యుదాఘాతానికి ఆమె ప్రాణాలు కోల్పోయింది.