పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఎవరి పౌరసత్వాన్ని హరించదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. ఈ వ్యవహారంలో ముస్లిం సోదరులను తప్పుదోవ పట్టిస్తున్నారని, ముస్లిం సోదరులు భయపడొద్దని అన్నారు.
‘మన ఇరుగుపొరుగు దేశాల్లో హింసను ఎదుర్కొంటున్నవారిని ఉద్దేశించిందే తప్ప.. ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ముస్లిం సోదరులు ఆందోళన చెందొద్దు. రెచ్చగొట్టే వారి మాటల్ని విశ్వసించొద్దు’ అని అమిత్ షా స్పష్టం చేశారు.