బీహార్ అసెంబ్లీలో ఈనెల 12న సీఎం నితీశ్ కుమార్ బల నిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో పాట్నాలో శనివారం విందు ఏర్పాటుచేశారు. ఈ విందుకు సొంత పార్టీ(జేడీయూ) ఎమ్మెల్యేలు 10మంది గైర్హాజరవడం కలకలం సృష్టించింది.
నితీశ్‌ను ఓడించేందుకు లాలూ నేతృత్వంలోని ఆర్జేడీ.. ఈ ఎమ్మెల్యేలకు తాయిలాలు ఇస్తోందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే.. వ్యక్తిగత కారణాలతోనే రాలేదని ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు.