పుట్నాల పప్పు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఫైబర్ అధికంగా ఉండటంతో జీర్ణ సమస్యలు పూర్తిగా తగ్గుతాయి. పుట్నాల పప్పులో ఫోలేట్, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు కూడా ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. గుండె, మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది.
నిమిషంలోనే ఒత్తిడి దూరం: రోజువారీ జీవితంలో ఒత్తిడి సహజం. కానీ అదే పనిగా ఒత్తిడి వేధిస్తే.. పలు సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఒత్తిడి లక్షణాలను గుర్తిస్తే వెంటనే తగ్గించుకునే ప్రయత్నం చేయటం మంచిది. ఇందులో గాఢంగా శ్వాస తీసుకోవటం ఒకటి. దీన్ని నిమిషం పాటు చేసినా ఒత్తిడి లక్షణాలు తగ్గుతాయి. దీర్ఘకాలం ఒత్తిడి బారినపడకుండా నివారించుకోవచ్చు. ఊపిరితిత్తులు సైతం మనం ప్రశాంతంగా ఉన్నామంటూ మెదడుకు సమాచారాన్ని చేరవేస్తాయి.